BIG BREAKING: అరెస్ట్ చేయొచ్చు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈరోజు కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డితో ఎర్రవెల్లి లోని తన ఫామ్ హౌస్ లో సమావేశం అయ్యారు. ఈ భేటీలో కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఊహించినదే అని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న కేబినెట్ సమావేశంలో భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్ట్పై కమిషన్ నివేదికను పవర్ పాయింట్ ద్వారా ప్రజెంటేషన్ చేశారు. అదే సమయంలో మెదక్ జిల్లా ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్లో పార్టీ ముఖ్య నేతలతో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అది కాళేశ్వరం కమిషన్ కాదు.. కాంగ్రెస్ కమిషన్ అని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఊహించినదేనని స్పష్టం చేశారు. దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
కొంత మంది బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేయవచ్చు.. భయపడ వద్దని వారికి సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పనికిరాదన్నవాడు అజ్ఞాని అని ఆయన అభివర్ణించారు.
కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని బీఆర్ఎస్ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని సూచించారు.
కాళేశ్వరంపై కేబినెట్లో ఏం నిర్ణయం తీసుకుంటారో వేచి చూద్దామని పార్టీ నేతలతో మాజీ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు