Bhu Bharathi Portal: ధరణి ప్లేస్‌లో కొత్త పోర్టల్

భూ భారతి పోర్టల్ లోగో, తెలంగాణ భూ రికార్డుల ఫోరెన్సిక్ ఆడిటింగ్ వివరాలు.
  • జనవరి 1, 2025 నుంచి ధరణి స్థానంలో భూ భారతి పోర్టల్ సేవలు ప్రారంభం.
  • టెర్రాసిస్ ఏజెన్సీ ద్వారా నిర్వహించిన ధరణి సమాచారాన్ని NICకు బదిలీ చేస్తుంది.
  • ఫోరెన్సిక్ ఆడిటింగ్ ద్వారా ధరణి లావాదేవీలపై ప్రభుత్వ విచారణ.
  • వేలాది ఎకరాల భూమి కబ్జా ఆరోపణలపై దృష్టి.

 

తెలంగాణలో జనవరి 1, 2025 నుంచి భూ భారతి పోర్టల్ సేవలు ప్రారంభం కానున్నాయి. ధరణి పోర్టల్ నిర్వాహణ ముగియనుండగా, నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (NIC) ఆధ్వర్యంలో భూ భారతి పోర్టల్ పూర్తి స్థాయిలో అమలులోకి రానుంది. ధరణి లావాదేవీలపై ఫోరెన్సిక్ ఆడిటింగ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వేలాది ఎకరాల భూమి కబ్జా ఆరోపణలపై విచారణకు సర్కార్ సిద్ధమైంది.


 

తెలంగాణలో భూ రికార్డుల నిర్వహణలో సంచలన మార్పులు చోటుచేసుకోనున్నాయి. జనవరి 1, 2025 నుంచి ధరణి పోర్టల్ స్థానంలో భూ భారతి పోర్టల్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. టెర్రాసిస్ ఏజెన్సీ నిర్వహించిన ధరణి సమాచారం నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (NIC)కు బదిలీ చేయనుంది.

ధరణి పోర్టల్ ఆధ్వర్యంలో వేలాది ఎకరాల భూమి అన్యాయంగా కబ్జా అయ్యిందన్న ఆరోపణల నేపథ్యంలో, తెలంగాణ ప్రభుత్వం ఫోరెన్సిక్ ఆడిటింగ్ చేపట్టాలని నిర్ణయించింది. అనుమానాస్పద లావాదేవీలపై దృష్టి పెట్టిన ప్రభుత్వం, రాత్రి వేళ జరిగిన లావాదేవీలు, సర్వే నంబర్ల తొలగింపు వంటి అంశాలపై కీలక విచారణ చేపట్టనుంది.

2014 నుండి ఇప్పటివరకు జరిగిన ధరణి లావాదేవీలపై ఆడిటింగ్ ప్రారంభమైంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకారం, సుమారు 2 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తుల పరం అయ్యాయి. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి కూడా నిషేధిత జాబితాలోని భూములపై జరిగిన అనుచిత లావాదేవీలపై ఆందోళన వ్యక్తం చేశారు.

ఫోరెన్సిక్ ఆడిటింగ్ తర్వాత ప్రత్యేక విచారణ కమిటీ వేసి దోషులను తేల్చే ప్రక్రియ వేగవంతం చేయనుంది. ఈ చర్యలతో అప్పటి ప్రభుత్వ పెద్దలు, రెవెన్యూ అధికారులు ఉన్నదున్నట్లు బయటపడనున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment