పాదుక దర్శన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాలని భోస్లే నారాయణరావు పటిల్ ను ఆహ్వానం

పాదుక దర్శన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాలని భోస్లే నారాయణరావు పటిల్ ను ఆహ్వానం

రామానందచార్య సంప్రదాయ జిల్లా సేవా సమితి తరఫున ఆహ్వాన పత్రిక అందజేత

నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం రామానందచార్య సంప్రదాయ జిల్లా సేవా సమితి ఆధ్వర్యంలో పాదుక దర్శన కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా సమితి ప్రతినిధులు ముధోల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, మాజీ శాసనసభ్యులు భోస్లే నారాయణరావు పటిల్ ను పాదుక దర్శన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాలని ఆహ్వానిస్తూ పత్రిక అందజేశారు.

ఈ కార్యక్రమం 2025 నవంబర్ 6వ తేదీ గురువారం, ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జిఎస్ గార్డెన్, ఓని రోడ్, బాసర కేంద్రంలో జరగనుంది.

ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ చంద్రకాంత్ , మాజీ కోఆప్షన్ సభ్యుడు గోవింద్ పటేల్ , పార్టీ సీనియర్ నాయకులు నరేందర్ మరియు ఇతరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment