శ్రీ అయ్యప్ప ఆలయంలో భవాని మాలాధారణ
మనోరంజని ప్రతినిధి, నిర్మల్ సెప్టెంబర్ 22
నిర్మల్ జిల్లా సోన్ మండలం కడ్తాల్ గ్రామంలోని శ్రీ ధర్మశాస్త అయ్యప్ప ఆలయంలో శ్రీ దేవి శరన్నవరాత్రుల సందర్భంగా సోమవారం భక్తులు భవాని మాలాధారణ స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆలయ గురుస్వామి నర్సారెడ్డి ఆధ్వర్యంలో అమ్మవారికి పంచామృతాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాలధారణ చేసిన భక్తులకు దీక్షా నియమాలను వివరించారు.
మాలధారణకు ముందు భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి, ఆలయ ప్రాంగణంలో భక్తి భావంతో కార్యక్రమాల్లో పాల్గొన్నారు.