రామారావు మహారాజ్ కు భారతరత్న ఇవ్వాలి : ఎస్టీ సెల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద్ నాయక్

రామారావు మహారాజ్ కు భారతరత్న ఇవ్వాలి : ఎస్టీ సెల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద్ నాయక్

రామారావు మహారాజ్ కు భారతరత్న ఇవ్వాలి : ఎస్టీ సెల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద్ నాయక్

మనోరంజని ప్రతినిధి – నిర్మల్

రామారావు మహారాజ్ కు భారతరత్న ఇవ్వాలి : ఎస్టీ సెల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద్ నాయక్

గిరిజన ఆరాధ్య దైవం, బాల బ్రహ్మచారి, బంజారా లంబాడ శక్తి పీఠ జాతీయ అధ్యక్షులు డాక్టర్ శ్రీ రామారావు మహారాజ్ కు భారతరత్న పురస్కారం ఇవ్వాలని ఎస్టీ సెల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద్ నాయక్ డిమాండ్ చేశారు.

దేశంలో 15 కోట్లకు పైగా ఉన్న బంజారా జనాభాను సన్మార్గంలో నడిపించడానికి మహారాజ్ జీవితాంతం కృషి చేశారని ఆయన తెలిపారు. తండాలలో పర్యటిస్తూ దేవాలయాల నిర్మాణం, ఆధ్యాత్మిక చైతన్యం, విద్యపై అవగాహన కల్పించి సమాజాన్ని చెడు మార్గాలనుంచి దూరం చేశారని అన్నారు.

85 సంవత్సరాలుగా తిండి లేకుండా కేవలం ఫలాహారం మాత్రమే తీసుకుంటూ, శివైక్యం సాధించిన మహారాజ్ సేవలు విశిష్టమైనవి అని పేర్కొన్నారు. అలాంటి మహనీయుని సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం భారతరత్నతో సత్కరించాలని గోవింద్ నాయక్ కోరారు.

ఈ కార్యక్రమంలో ఎల్ హెచ్ పి ఎస్ జిల్లా నాయకులు కిషన్ నాయక్, రాజేశ్వర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment