భగవాన్ శ్రీ సత్య సాయి శత జయంతి ఉత్సవాలు.
మనోరంజని ప్రతినిధి సారంగాపూర్ ఆగస్టు 24
నిర్మల్ జిల్లా,సారంగాపూర్ : మండలంలోని వంజర్ సత్య సాయి నగర్ లో భగవాన్
శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా సత్య సాయి సేవా సంస్థ నిర్మల్ జిల్లా ఆద్వర్యంలో ఆదివారం సత్య సాయి బాబా చిత్ర పటానికి పూజలు నిర్వహించి భజన చేసే అనంతరం పలు కార్యక్రమంలో చేపట్టారు. వైద్యశిబిరం నిర్వహించి ఉచితంగా మందులను అందజేశారు.అలాగే ముగ్గుల పోటీ,కబడ్డీ,కోకో పోటీలు నిర్వహించారు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రంలో సేవ సమితి అద్యక్షులు భీమ్ సేన్,నాయకులు కోరిపెల్లి రాజేశ్వర్ రెడ్డి , సత్యసాయి బృందం సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.