బీజేపీ నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా కరిపే విలాస్‌కు శుభాకాంక్షలు
మనోరంజని, తెలుగు టైమ్స్, సారంగాపూర్ ప్రతినిధి | అక్టోబర్ 07
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా కరిపే విలాస్ నియమితులయ్యారు. బీజేపీ శాసనసభ పక్ష నేత, నిర్మల్ శాసనసభ్యులు ఎలేటి మహేశ్వర్ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్ కలిసి ఈ నియామకాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా సోమవారం జరిగిన కార్యక్రమంలో బీజేపీ నాయకులు కరిపే విలాస్‌ను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ వేడుకలో నాయకులు అయ్యర్ రాజా రెడ్డి, ఇప్ప శ్రీకాంత్ రెడ్డి, పి. పోతారెడ్డి, సాహెబ్ రావు, దినేష్, మధు తదితరులు పాల్గొన్నారు.