ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలకు సన్మానం.
మనోరంజని ప్రతినిధి సారంగాపూర్ సెప్టెంబర్ 14
నిర్మల్ జిల్లా, సారంగాపూర్:మండలం లోని జామ్ గ్రామానికి చెందిన భుమేష్ ఉపాధ్యాయుడు ఉమ్మడి అదిలాబాద్ జిల్లా లో
ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా అదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజశిర్ష, డిఈఓ కుష్బూ గుప్తా గార్ల చేతులమీదుగా భూమేష్ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా పదవ తరగతి మిత్ర బృందం స్వగ్రామంలో ఆదివారం భూమేష్ కు శాలువా పూలమాలలతో సన్మానించి అభినందించారు. సన్మానించారు. ఇలాంటివి మరెన్నో ఉత్తమ పదవులు అవార్డుల అందుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పి.ఎ.సి.ఎస్ వైస్ చైర్మన్ గంగన్న,ప్రవీణ్ గౌడ్, సామల రవి కుమార్, ప్రభాకర్ పలువురు లు పాల్గొన్నారు.