ప్రిన్సిపల్ అవార్డు గ్రహీతకు సన్మానం
ఆర్జిఎన్ హ్యూమన్ రైట్స్ మరియు అవినీతి నిరోధక సంఘం
విజేత పాఠశాల సేవలు అమోఘం
మనోరంజని ప్రతినిధి, భైంసా – ఆగస్టు 15
హైదరాబాద్లో సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన డా. బి.ఆర్. అంబేడ్కర్ ఎక్సలెన్స్ అవార్డు – 2025ను నిర్మల్ జిల్లా తానూర్ మండలం బెల్ తరోడాలో గల విజేత హైస్కూల్ ప్రిన్సిపల్ రాథోడ్ గణేష్ డైరెక్టర్ వి. రమేష్ అందుకున్నారు. ఈ సందర్భంగా, శుక్రవారం ఆర్జిఎన్ హ్యూమన్ రైట్స్ మరియు అవినీతి నిరోధక సంఘం నిర్మల్ జిల్లా సెక్రటరీ సూర్యవంశీ మాధవరావు పటేల్, జనరల్ సెక్రటరీ జల్లా హన్మండ్లు శాలువ కప్పి సన్మానించారు.సూర్యవంశీ మాధవరావు పటేల్ మాట్లాడుతూ, “విజేత హైస్కూల్ యాజమాన్యం గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి మార్గదర్శిగా నిలుస్తోంది. నిరుపేద, రైతు కుటుంబాల విద్యార్థులకు తక్కువ ఫీజులు వసూలు చేయడం ప్రశంసనీయమైన విషయం” అన్నారు. ఆయన విజేత పాఠశాల సేవలను అమోఘమని అభివర్ణించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, పోషకులు తదితరులు పాల్గొన్నారు