: బీర్సాముండా పోరాటం స్ఫూర్తిదాయకం: ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

బీర్సాముండా 150వ జయంతి వేడుకలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
  • బీర్సాముండా పోరాటం ఆదివాసి హక్కుల కోసం పోరాడిన స్ఫూర్తి
  • ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆదివాసి సమస్యలపై చర్చ
  • అటవీ ప్రాంతాలలో మౌలిక సదుపాయాలు లేమి
  • కొలం గిరిజనులకు జీవన ఉపాధి కల్పించే ఉద్దేశం

 బీర్సాముండా 150వ జయంతి వేడుకలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ఉట్నూర్‌లో బీర్సాముండా 150వ జయంతి వేడుకలలో పాల్గొని, ఆయన పోరాటాన్ని స్ఫూర్తిదాయకంగా అభివర్ణించారు. అడవి హక్కుల కోసం ఆయన చేసిన పోరాటాన్ని గుర్తు చేస్తూ, అటవీ ప్రాంతాల ఆదివాసి సమస్యలను తీర్చే దిశగా చర్యలు తీసుకోవాలని అన్నారు. అలాగే, కొలం గిరిజనుల జీవన ఉపాధి కోసం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు.

ఉట్నూరు, నవంబర్ 15 (M4 న్యూస్):

ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ శుక్రవారం ఉట్నూరు మండల కేంద్రంలోని ఎంపీడిఓ కార్యాలయ ఆవరణలో వీర్ బీర్సాముండా 150వ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా, బీర్సాముండా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే, బీర్సాముండా పోరాటం అత్యంత స్ఫూర్తిదాయకమై, ఆదివాసి హక్కుల కోసం ఆయన చూపిన ధైర్యం గొప్పదన్నారు. ఆయన స్ఫూర్తితోనే రాంజీ గోండు, కోమరం భీం వంటి యోధులు కూడా తమ హక్కుల కోసం పోరాడారని అన్నారు.

ఆయన మాట్లాడుతూ, అటవీ హక్కులపై అడవి ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు ఇంకా పరిష్కారం కాని విషయమని, ముఖ్యంగా ఫారెస్ట్ యాక్ట్ల కారణంగా అడవి ప్రాంతాలలో నివసించే ఆదివాసులకు అభివృద్ధి జరగడం చాలా కష్టం అని తెలిపారు. అటవీ ప్రాంతంలోని గ్రామాల్లో మౌలిక సదుపాయాలు లేకపోవడం ప్రధాన కారణమని తెలిపారు.

వీర్ బీర్సాముండా పోరాటం నుంచి ప్రేరణ తీసుకుని, అటవీ ప్రాంతాల ఆదివాసి ప్రజల హక్కుల సాధన కోసం పోరాడాలని, ప్రతి గ్రామంలో గ్రామ సభలు ఏర్పాటు చేసి, ప్రభుత్వానికి తమ సమస్యలను చేరవేయాలని పేర్కొన్నారు.

కొలం గిరిజనులు వీధుర వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్నారని, వారికీ మంచి జీవన వనరులను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, అటవీ ప్రాంతాలలోని దేవాలయాల అభివృద్ధికి కేంద్రం సహాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంఘాల నాయకులు, గ్రామ పటేళ్లు, పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment