సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండండి
ప్రముఖ పిల్లల వైద్యులు డాక్టర్. బందెల నరేష్
ముధోల్ మనోరంజని ప్రతినిధి జూలై 28
వర్షాకాలంలో వచ్చే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రముఖ పిల్లల వైద్యులు డాక్టర్. బందెల నరేష్ సూచించారు. మండల కేంద్రమైన ముధోల్ లోని రబింద్రా ఉన్నత పాఠశాలలో ప్రముఖ చిన్న పిల్లల వైద్యులు డాక్టర్ బందెలు నరేష్ విచ్చేసి విద్యార్థులకు అవగాహన కల్పించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలో దోమల బెడద అధికంగా ఉండడంతో డెంగ్యూ మలేరియా విష జ్వరాలు ప్రబలె అవకాశం ఎక్కువగా ఉంటుందని అన్నారు. అనారోగ్య సమస్యలతో బాధపడే విద్యార్థులు సరైన సమయంలో చికిత్స తీసుకోవడం వల్ల త్వరగా కోలుకోవచ్చని పేర్కొన్నారు. ఆహారపు అలవాట్ల గురించి అవగాహన కల్పించారు. విద్యార్థులకు కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రబింద్రా ఉన్నత పాఠశాల ప్రిన్సిపల్ అసంవార్ సాయినాథ్, కరస్పాండెంట్ రాజేందర్, డైరెక్టర్ పోతన్న యాదవ్, చైర్మన్ భీమరావు దేశాయ్, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు