కమ్మర్పల్లి మండలంలో బీసీ బంద్‌లో పాల్గొన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ & ధర్మ సమాజ్ పార్టీ నాయకులు

కమ్మర్పల్లి మండలంలో బీసీ బంద్‌లో పాల్గొన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ & ధర్మ సమాజ్ పార్టీ నాయకులు

కమ్మర్పల్లి మండలంలో బీసీ బంద్‌లో పాల్గొన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ & ధర్మ సమాజ్ పార్టీ నాయకులు

 

బీసీ లకు 42% రిజర్వేషన్ల అమలుకు డిమాండ్

జేఏసీ మరియు ధర్మ సమాజ్ పార్టీ సంయుక్తంగా బంద్‌కు మద్దతు

అమీర్ నగర్, కమ్మర్పల్లి కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బీసీ లకు 42% రిజర్వేషన్ల అమలు కోసం జరుగుతున్న బంద్‌లో కమ్మర్పల్లి మండల బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ మరియు ధర్మ సమాజ్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. అమీర్ నగర్ గ్రామం, కమ్మర్పల్లి కేంద్రంలో నిర్వహించిన బంద్ కార్యక్రమాల్లో ప్రజలతో కలిసి రిజర్వేషన్ల సాధనకు మద్దతు తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ లకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్లను అమలు చేయాలనే డిమాండ్‌తో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన బీసీ బంద్‌కు కమ్మర్పల్లి మండలంలో విస్తృత మద్దతు లభించింది.
బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ డా. విశారదన్ మహారాజ్ ఆదేశాల మేరకు కమ్మర్పల్లి మండలంలోని అమీర్ నగర్ గ్రామం, అనంతరం మండల కేంద్రంలో బంద్ కార్యక్రమాలు జరిగాయి.

ఈ సందర్భంగా బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ తరపున గుర్రం నరేష్, మెరుగు నాగేశ్వర్, గుండోజి నవీన్, కల్ల ఆనంద్, ధర్మ సమాజ్ పార్టీ తరపున మండల అధ్యక్షుడు నల్ల కైలాస్, అమీర్ నగర్ శాఖ అధ్యక్షుడు గుర్రం సాగర్ పాల్గొన్నారు.
నాయకులు మాట్లాడుతూ బీసీ లకు 42% రిజర్వేషన్లను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చి చట్టబద్ధం చేయాలని, బీసీల హక్కుల సాధన కోసం పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment