జనాభా దమాషా ప్రకారం బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలి: అడ్వకేట్ జగన్ మోహన్
-
బీసీ రిజర్వేషన్లు 42% అమలుచేయాలని బిఎస్పీ డిమాండ్
-
కాంగ్రెస్ హామీలను గుర్తుచేసిన బిఎస్పీ జిల్లా అధ్యక్షుడు
-
బీసీలకు చట్ట సభలలో రిజర్వేషన్ లేకపోవడం దారుణమని వ్యాఖ్య
బహుజన సమాజ్ పార్టీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు అడ్వకేట్ జగన్ మోహన్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు 42% అమలుచేయాలని డిమాండ్ చేశారు. జనాభా దమాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలని కోరుతూ, బీసీలకు న్యాయం జరగకపోవడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యమని ఆయన తీవ్రంగా విమర్శించారు.
నిర్మల్ అక్టోబర్ 18: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు 42% అమలుచేయాలని బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అడ్వకేట్ జగన్ మోహన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
నిర్మల్ జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడిన ఆయన మాట్లాడుతూ, “అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో బీసీ కులగణన చేసి 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని హామీ ఇచ్చింది. కానీ ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తూ ఆ వాగ్దానాన్ని అమలు చేయడం లేదు,” అని మండిపడ్డారు.
అలాగే ఆయన 1990లో మాన్యశ్రీ కాన్షీరాం గారు చేసిన బహుజన ఉద్యమాన్ని గుర్తు చేస్తూ, “మండల కమిషన్ ఏర్పాటు తర్వాతే బీసీ సమాజానికి విద్య, ఉద్యోగ రంగాల్లో 27 శాతం రిజర్వేషన్లు దక్కాయి. కానీ ఇంకా బీసీలకు చట్ట సభలలో రిజర్వేషన్ ఇవ్వకపోవడం దారుణం,” అన్నారు.
బీసీలు కుల, పార్టీ భేదాలు మరిచి ఐక్యంగా రిజర్వేషన్ల సాధన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బిఎస్పీ నాయకులు అడ్వకేట్ దేవదాస్ రెడ్డి, లక్ష్మీ యాదవ్, డాక్టర్ దుద్పాల రాజేశ్వర్, సయ్యద్ హైదర్, శ్రీనివాస్, శ్రీవిద్య తదితరులు పాల్గొన్నారు.