కాంగ్రెస్‌లో చేరిన బీసీ నాయకుడు చెన్నజి లక్ష్మణ్
మనోరంజని తెలుగు టైమ్స్ – సారంగాపూర్, డిసెంబర్ 06
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం చించోలి (బి) గ్రామానికి చెందిన బీసీ నాయకుడు చెన్నజి లక్ష్మణ్ శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. జిల్లా జడ్పీటీసీ ఫోరం అధ్యక్షుడు పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో లక్ష్మణ్‌ను పార్టీ కండువాతో ఆహ్వానించారు.ఈ సందర్భంగా చెన్నజి లక్ష్మణ్ మాట్లాడుతూ, ప్రభుత్వం అమలు చేస్తున్న పలు ప్రజాసంక్షేమ పథకాలు ఆకర్షించడంతో కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితుడినై చేరినట్లు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం తాను అహర్నిశలు కృషి చేస్తానని వెల్లడించారు.