అమ్మవారి సన్నిధిలో బిసి కమిషన్ చైర్మన్
ఎమ్4ప్రతినిధి ముధోల్
దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్- కమిషన్ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో కమిషన్ చైర్మన్ తో పాటు సభ్యులకు స్వాగతం పలికారు. కమిషన్ చైర్మన్ సభ్యులకు అనంతరం ఆలయ అధికారులు అమ్మ వారి తీర్థ ప్రసాదాలతో పాటు అమ్మవారి ప్రతిమను అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.