రామకృష్ణ విద్యాలయంలో బతుకమ్మ సంబరాలు

రామకృష్ణ విద్యాలయంలో బతుకమ్మ సంబరాలు

మనోరంజని ప్రతినిధి నిజామాబాద్ – సెప్టెంబర్ 20

రేపటినుండి ప్రారంభమయ్యే దసరా సెలవుల నేపథ్యంలో రామకృష్ణ విద్యాలయంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు తంగేడు పూలతో సహా వివిధ పుష్పాలతో అందంగా ముస్తాబు చేసిన బతుకమ్మను ఏర్పాటు చేసి, పాటలు పాడుతూ, నృత్యాలతో ఉత్సాహంగా ఆడిపాడారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ శశిరేఖ శ్రీనివాస్ మాట్లాడుతూ, “బతుకమ్మ ఉత్సవాలు సాధారణంగా వారం రోజుల పాటు జరుగుతాయి. అయితే పాఠశాలలకు సెలవులు ఉండటంతో, ఈరోజే సద్దుల బతుకమ్మ వరకు జరుపుకున్నాం. విద్యార్థులు ప్రకృతికి హాని కలగని పూలు, రంగులతో బతుకమ్మను ముస్తాబు చేసి సాంస్కృతిక కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొన్నారు” అని తెలిపారు. అలాగే విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో హెడ్మాస్టర్ సముద్రాల మధుసూదనాచారి, ఉపాధ్యాయులు మాధురి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment