కుంటాలలోని శాంతినికేతన్ విద్యానిలయంలో ముందస్తు బతుకమ్మ వేడుకను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థినిలు అనేక రకాల బతుకమ్మలను పేర్చి తీసుకొని వచ్చారు. ఆనాది నుండి ప్రకృతిని ఆరాధించడం మన సంప్రదాయమని డైరెక్టర్ ప్రవీణ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బతుకమ్మకు పూర్వ వైభవం తెలంగాణ ప్రజలు తెచ్చారని జాతి, మత, కుల, భేదాలు లేకుండా బతుకమ్మను అందరు జరుపుకొని ఐక్యంగా మెలుగుతున్నారని ప్రిన్సిపల్ సంతోష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
కుంటాల శాంతినికేతన్ విద్యా నిలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Published On: September 20, 2025 6:40 pm