అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు

Nirmal Bathukamma Celebrations 2024
  • నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రాథమిక బాలికల పాఠశాలలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
  • పిల్లలకు బతుకమ్మ పండుగ విశిష్టతను వివరించిన ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్.
  • విద్యార్థినులు, ఉపాధ్యాయులు అందరూ పూలతో బతుకమ్మను తయారు చేసి, నిమజ్జనం చేశారు.

 

నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక బాలికల పాఠశాల సోంవార్ పెట్ లో ముందస్తుగా బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. పండుగలా అలంకరించుకొని విద్యార్థినులు బతుకమ్మను తయారుచేసి, శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం చెరువులో నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ బతుకమ్మ పండుగ విశిష్టతను వివరించారు.

 

నిర్మల్ జిల్లా ప్రభుత్వ ప్రాథమిక బాలికల పాఠశాల సోంవార్ పెట్ లో బతుకమ్మ సంబరాలు ముందస్తుగా ఘనంగా జరిగాయి. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే ఈ పండుగను విద్యార్థినిలు కోలాహలంగా జరుపుకున్నారు. పూలతో బతుకమ్మను అందంగా తయారుచేసి, శోభాయాత్రగా వెళ్లి చెరువులో నిమజ్జనం చేశారు.

ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ మాట్లాడుతూ బతుకమ్మ పండుగ యొక్క ప్రత్యేకతను పిల్లలకు క్లుప్తంగా వివరించారు. విద్యార్థినులకు తమ సాంప్రదాయాల పట్ల గౌరవం పెరగాలన్నది తన ఆకాంక్ష అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బొద్దుల వెంకట రమణ, సుజాత, విద్యార్థినిలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment