తానూర్ జూనియర్ కళాశాలలో కన్నుల పండువగా బతుకమ్మ సంబరాలు
ఎమ్4 న్యూస్, తానూర్ (ప్రతినిధి), అక్టోబర్ 05
- తానూర్ జూనియర్ కళాశాలలో బతుకమ్మ పండుగ ఘనంగా నిర్వహణ.
- విద్యార్థినిలు రంగు రంగుల పూలతో బతుకమ్మలు పేర్చి పాటలు పాడుతూ సంబరాలు.
- కళాశాల ప్రిన్సిపాల్ ఫణి రాజశేఖర్ పూజలతో కార్యక్రమం ప్రారంభం.
నిర్మల్ జిల్లా తానూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బతుకమ్మ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థినిలు బతుకమ్మలు పేర్చి పాటలు పాడారు. ప్రిన్సిపాల్ ఫణి రాజశేఖర్ పూజలతో సంబరాలు ప్రారంభించారు.
నిర్మల్ జిల్లా తానూర్ మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం బతుకమ్మ పండుగను ఘనంగా జరిపారు. విద్యార్థినిలు రంగు రంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, పాటలు పాడుతూ ఆనందంతో బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఫణి రాజశేఖర్ బతుకమ్మ సంబరాలను ప్రత్యేక పూజలతో ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ, బతుకమ్మ పండుగ ప్రత్యేకతను విద్యార్థులకు వివరించారు. కళాశాల ప్రాంగణంలో జరిగిన ఈ వేడుకలో అధ్యాపకులు నరేష్, లక్ష్మణ్, రాజేందర్, ఇతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.