ఒకే రోజు ఏడు వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన ఎమ్మెల్యే
ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి )
భైంసా : అక్టోబర్ 26
రైతాంగసంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు ఎమ్మెల్యే పవా ర్ రామారావు పటేల్.. గత నాలుగు ఐదు రోజులుగా బిజెపి పార్టీ కార్యక్రమాల్లో భాగంగా హైదరాబాదులో ఉన్న ఎమ్మెల్యే పవార్ రామరావ్ మహా ధర్నాను ముగించుకొని హుటా హుటిన నిన్న రాత్రి బైంసాకు చేరుకున్నారు. ఈరోజు ఉదయం 9 గంటల నుండి ఆయన కుంటాల మండలంలో పర్యటించారు. వరి రైతాంగానికి ఇబ్బందులు తలెత్తకుండా, కేంద్ర ప్రభుత్వం ద్వారా మద్దతు ధర ఇచ్చేందుకు కుంటాల మండలం తో పాటు నర్సాపూర్ మండలంలో ఒకే రోజు ఏడు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. కుంటాల మండలంలోని లింబా(కే ), అంబకంటి గ్రామాలతో పాటు, నర్సాపూర్ మండలంలోని గొల్లమాడ, నందన్, డోంగూర్ గాం,చాక్ పెల్లి, బూరుగుపల్లి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారంటే ఎంత నిబద్ధతగా పనిచేస్తున్నారో స్పష్టమవుతుంది. ఇచ్చిన మాట ప్రకారం విద్యా, వైద్యం వ్యవసాయం, సాగునీటి రంగాలపై ఆయన ప్రధాన దృష్టి సారిస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పటేల్ మాట్లాడుతూ రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో తమ పంటను అమ్మాలన్నారు.