బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న శృంగేరి పీఠాధిపతి
స్వాగతం పలికిన ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్
ఆలయపునర్నిర్మాణాన్ని మ్యాప్ ద్వారా వివరించిన ఎమ్మెల్యే
బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారిని శృంగేరి పిఠాధిపతి విధుశేఖర భారతి స్వామి దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, అధికారులు స్వామి వారిని పూర్ణకుంభం తో స్వాగతం పలికారు. ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ స్వామికి స్వాగతం పలికి ఆశీస్సులు అందుకున్నారు.. అనంతరం ఆలయ పునర్నిర్మణాన్ని ఎమ్మెల్యే మ్యాప్ ద్వారా స్వామికి వివరించారు.దేశం లో పవిత్ర పుణ్య క్షేత్రం బాసర ను సందర్శించినందుకు ధన్యవాదాలు తెలిపారు. మీ సూచనలు సలహాలు తమకు ఎంతో అవసరమని స్వామీజీకి తెలియజేశారు. శృంగేరి పీఠాధిపతిగా అమ్మవారి చెంతకు రావడం ఎంతో ఆనందాన్ని చ్చిందన్నారు. వ్యాసమహర్షి తపస్సు చేసిన ప్రాంతం సరస్వతి అమ్మవారు ఇక్కడ సాక్షాత్తు దర్శనం ఇవ్వడం ఇది ఎంతో పుణ్య భూమి అని స్వామీజీ అన్నారు.