ఉట్నూర్‌లో అమరవీరుడు ఆర్. శంకర్ జ్ఞాపకార్థం బ్యారక్ ప్రారంభం

ఉట్నూర్‌లో అమరవీరుడు ఆర్. శంకర్ జ్ఞాపకార్థం బ్యారక్ ప్రారంభం

ఉట్నూర్‌లో అమరవీరుడు ఆర్. శంకర్ జ్ఞాపకార్థం బ్యారక్ ప్రారంభం

మనోరంజనీ, అక్టోబర్ 14, 2025 (M4News):

ఉట్నూర్‌లో అమరవీరుడు ఆర్. శంకర్ జ్ఞాపకార్థం బ్యారక్ ప్రారంభం



అక్టోబర్ 21 ఫ్లాగ్ డే వారోత్సవాల సందర్భంగా, ఉట్నూర్‌లో అమరవీరుడు ఆర్. శంకర్ జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన బ్యారక్‌ను ప్రారంభించడం జరిగింది. ఆర్. శంకర్ 1999లో బోథ్ ప్రాంతంలో సంఘవిద్రోహశక్తులతో పోరాడి అసువులు బాసిన ఘనత కలిగిన అమరవీరుడు. ఈ కార్యక్రమంలో ఆయన కుటుంబ సభ్యుల సమక్షంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఐపీఎస్ మరియు ఉట్నూర్ అదనపు ఎస్పీ కాజల్ సింగ్, ఐపీఎస్ పూజా కార్యక్రమాలు నిర్వహించి రిబ్బన్ కట్ చేసి బ్యారక్ ప్రారంభించారు.

ఉట్నూర్‌లో అమరవీరుడు ఆర్. శంకర్ జ్ఞాపకార్థం బ్యారక్ ప్రారంభం

ఉట్నూర్ సబ్ డివిజనల్ సమీక్ష

  • సబ్ డివిజనల్ అధికారులతో సమావేశం నిర్వహించి మండలాలలో ప్రజలతో సత్సంబంధాలు మెరుగుపరచడం మరియు యువత, ప్రజలు, ఆదివాసీలకు మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పించడం.

  • గుడుంబా, మాదక ద్రవ్యాలు, పేకాట, మట్కా వంటి అసాంఘిక కార్యకలాపాలపై పటిష్టమైన నియంత్రణ.

  • జిల్లా పోలీసు కార్యాలయంలో ఫిర్యాదుల, పెండింగ్ కేసుల, దర్యాప్తు పూర్తయిన కేసుల సమీక్ష.

  • ప్రభుత్వ రాయితీ బియ్యం సరైన వ్యక్తులకు మాత్రమే వెళ్తున్నదని పర్యవేక్షణ.

  • రాత్రి సమయాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు, వాహన ప్రమాదాల నివారణ, ఓపెన్ డ్రింకింగ్ నివారణకు డయల్ 100 ద్వారా గస్తీ నిర్వహణ.

  • ఉట్నూర్‌లో అమరవీరుడు ఆర్. శంకర్ జ్ఞాపకార్థం బ్యారక్ ప్రారంభం

ఈ కార్యక్రమంలో ఉట్నూర్ అదనపు ఎస్పీ కాజల్ సింగ్, ఉట్నూర్ సీఐ ఎం. ప్రసాద్, నార్నూర్ సీఐ పి. ప్రభాకర్, ఆర్. శంకర్ భార్య ఆర్. దూరి భాయ్, కుమార్తె నిర్మల, ఎస్సైలు సాయన్న, ప్రవీణ్, అఖిల్, మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment