ఎమ్మెల్యేపై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదు: కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ నిర్మల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద నాయక్

M4 న్యూస్ (ప్రతినిధి),

నిర్మల్, అక్టోబర్ 22, 2024:

కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ నిర్మల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద నాయక్, ఖానాపూర్ శాసనసభ్యులు వెడమ్మ బొజ్జు పటేల్ గారిపై ఉద్దేశపూర్వకంగా చేస్తున్న అసత్య ఆరోపణలను ఖండించారు. ప్రతిపక్ష నాయకులు ఎలాంటి ఆధారాలు లేకుండా ఎమ్మెల్యేపై ఆరోపణలు చేస్తున్నారని, ఈ ఆరోపణలను తాము సహించేది లేదని గోవింద నాయక్ స్పష్టం చేశారు.

నిత్యం ప్రజాసేవలో నిమగ్నమై, ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్న ఎమ్మెల్యేపై ఇలాంటి ఆరోపణలు పూర్తిగా తప్పుడు అభిప్రాయంతో చేస్తున్నారని గోవింద నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వెడమ్మ బొజ్జు పటేల్ గారిని ప్రతిపక్షం ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తున్నదని, ఆ విషయంలో కాంగ్రెస్ పార్టీ స్టాండ్ స్పష్టం చేస్తోంది.

Leave a Comment