ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని బాణావత్ గోవింద్ నాయక్ పిలుపు
ప్రజా ప్రభుత్వంలో గిరిజన ప్రాంతాలకు సంక్షేమం చేరువ – నిర్మల్ జిల్లా ఆదివాసి కాంగ్రెస్ చైర్మన్
ప్రజా ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని నిర్మల్ జిల్లా ఆదివాసి కాంగ్రెస్ పార్టీ చైర్మన్ బాణావత్ గోవింద్ నాయక్ పిలుపునిచ్చారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇండ్లు, తెల్ల రేషన్ కార్డులు, సన్నబియ్యం, నాణ్యమైన విద్యుత్తు వంటి పథకాలతో ప్రభుత్వం గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉందని అన్నారు.
నిర్మల్ జిల్లా ఆదివాసి కాంగ్రెస్ పార్టీ చైర్మన్ బాణావత్ గోవింద్ నాయక్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్లు, తెల్ల రేషన్ కార్డులు, సన్న బియ్యం, నాణ్యమైన విద్యుత్తు సరఫరా వంటి సంక్షేమ పథకాలు ఇప్పుడు మారుమూల గిరిజన గూడాలు, తండాలకు చేరుతున్నాయని పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ప్రవేశ దశకు చేరుకోవడం ప్రజలకు శుభసూచకమని అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో, స్థానిక ఎమ్మెల్యే వెడమ్మ బొజ్జు పటేల్ కృషితో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.