దండారి (గుస్సాడి) ఉత్సవాల్లో బలరాం జాదవ్
-
నేరడిగొండ మండలం మంగల్ మోటాలో దండారి ఉత్సవాలు ఉత్సాహంగా ప్రారంభం
-
ఆధ్యాపక సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ ప్రత్యేక అతిథిగా పాల్గొనడం
-
ఆదివాసి సంప్రదాయాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు రావాలంటూ పిలుపు
నేరడిగొండ మండలం మంగల్ మోటా గ్రామంలో దీపావళి సందర్భంగా నిర్వహిస్తున్న దండారి (గుస్సాడి) ఉత్సవాల్లో తెలంగాణ రాష్ట్ర ఆధ్యాపక సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ పాల్గొన్నారు. ఆదివాసి సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచానికి ప్రత్యేక గుర్తింపుగా నిలుస్తున్నాయని ఆయన అన్నారు.
ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం మంగల్ మోటా గ్రామంలో దీపావళి పండుగ సందర్భంగా వారం రోజుల పాటు సంప్రదాయ బద్దంగా దండారి (గుస్సాడి) ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో గ్రామస్థుల ఆహ్వానం మేరకు తెలంగాణ రాష్ట్ర ఆధ్యాపక సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బలరాం జాదవ్ మాట్లాడుతూ, “గ్రామస్తులు నిర్వహించే దండారి ఉత్సవాలు భారతదేశంలో ప్రసిద్ధి చెందిన సాంప్రదాయ వేడుకలు. ఈ ఉత్సవాలు ఆదివాసి బిడ్డలకు ప్రత్యేక గుర్తింపును తెస్తున్నాయి. మన దేశ సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవడం మనందరి బాధ్యత. సంస్కృతి రక్షణ వల్ల ఐక్యత పెరుగుతుంది, ప్రజలు ఆనందంలో ఉంటారు,” అని అన్నారు.
అదేవిధంగా, “మన దేశంలో ఉన్నటువంటి సంప్రదాయాలు ప్రపంచంలో ఎక్కడా లేవు. వాటిని కాపాడుకోవడం ద్వారా మన సంస్కృతి తరతరాలకు కొనసాగుతుంది,” అని గ్రామ ప్రజలను అభినందించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.