బాలాపూర్ గణపతి లడ్డు సరికొత్త రికార్డు!*

*బాలాపూర్ గణపతి లడ్డు సరికొత్త రికార్డు!*

*మనోరంజని: న్యూస్ ప్రతినిధి*

హైదరాబాద్:సెప్టెంబర్ 06
బాలాపూర్ గణనాథుడి లడ్డూ వేలంపాటలో సరికొత్త రికార్డు నమోదైంది. గతంలో కంటే ప్రస్తుతం అత్యధిక ధర పలికింది. ఈసారి మొత్తం 38మంది సభ్యులు ఈ వేలంలో పాల్గొన్నారు.

గతంలో వేలంపాటల్లో లడ్డూ దక్కించుకున్న 31మందితోపాటు మరో ఏడుగురు పాల్గొన్నారు. వీరు రూ.30.01లక్షలతో పాటు రూ.500 నాన్ రిఫండబుల్ డిపాజిట్ చేశారు. అయితే, గతేడాది 2024 సంవత్సరం బాలాపూర్ గణపతి లడ్డూ రూ.30,01,000 పలికింది.

కాగా.. ప్రస్తుతం నిర్వహించిన వేలంపాటలో లడ్డూ ధర రూ.35లక్షలు పలికింది. కర్మన్ ఘాట్ కు చెందిన లింగాల దశరథ్ గౌడ్, వేలం పాటలో దక్కించుకున్నారు.ఖైరతాబాద్ గణేశుడి తరువాత భాగ్యనగరంలో అందరి దృష్టిని ఆకర్షించేది బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలంపాట. ఇక్కడి గణనా థుడి చేతిలో ఉండే లడ్డూ వేలం పాటతో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుంది.

లడ్డూను ఎవరు దక్కించు కుంటే వారింట సిరి సంపదలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. అందుకే బాలాపూర్ గణపతి లడ్డూ ను దక్కించుకునేందుకు తీవ్ర పోటీ ఉంటుంది. 31 ఏళ్లుగా ఇక్కడ లడ్డూ వేలం పాట కొనసాగుతుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment