- హైదరాబాద్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయీ సైన్స్ డ్రామా పోటీలలో విజయం.
- బైంసా వికాస్ హైస్కూల్ కన్సోలేషన్ బహుమతి పొందింది.
- విద్యార్థుల ప్రతిభను గుర్తించిన ప్రిన్సిపల్ గాంధారి రాజన్న.
రాష్ట్రస్థాయీ ఎస్సిఈఆర్టి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జరిగిన సైన్స్ డ్రామా పోటీలలో బైంసా వికాస్ హైస్కూల్ కన్సోలేషన్ బహుమతిని అందుకుంది. విద్యార్థులు విద్య, మనస్విని, చందు, కిషోర్, కమలేష్, సూర్య ప్రకాష్, గంగ ప్రసాద్ పోటీలో పాల్గొని ప్రతిభను ప్రదర్శించారు. ప్రిన్సిపల్ గాంధారి రాజన్న, ఉపాధ్యాయులు రత్న, మధుకర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఎమ్4 న్యూస్ (ప్రతినిధి)
నిర్మల్: అక్టోబర్ 18
రాష్ట్రస్థాయీ ఎస్సిఈఆర్టి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన సైన్స్ డ్రామా పోటీలలో అన్ని జిల్లాలతో పోటీపడి, బైంసా వికాస్ హైస్కూల్ కన్సోలేషన్ బహుమతిని పొందడం జరిగింది. ఈ పోటీలలో రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల విద్యార్థులు పాల్గొన్నారు.
బైంసా పట్టణంలో గల వికాస్ హైస్కూల్ విద్యార్థులు, విద్య, మనస్విని, చందు, కిషోర్, కమలేష్, సూర్య ప్రకాష్, గంగ ప్రసాద్‌లు పోటీలో పాల్గొని తమ ప్రతిభను కనబరిచారు. వీరి ప్రతిభను గుర్తించి వీరికి ప్రోత్సాహక బహుమతి లభించడం ప్రధానమైన విషయమని ప్రిన్సిపల్ గాంధారి రాజన్న తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ గాంధారి రాజన్నతోపాటు ఉపాధ్యాయురాలు రత్న మరియు సైన్సు ఉపాధ్యాయుడు మధుకర్ కూడా పాల్గొన్నారు.
సైన్స్ డ్రామా పోటీలలో నిర్మల్ జిల్లా ప్రోత్సాహక బహుమతి పొందినందుకు జిల్లా విద్యాధికారి రవీందర్ రెడ్డి వారికి అభినందనలు తెలియజేశారు.