బైంసా హిందూ ఉత్సవ సమితి సేవలు అభినందనీయం

బైంసా హిందూ ఉత్సవ సమితి సేవలు అభినందనీయం

బైంసా హిందూ ఉత్సవ సమితి సేవలు అభినందనీయం

జిల్లా ట్రస్మా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి

బైంసా మనోరంజని ప్రతినిధి అక్టోబర్ 15

బైంసా పట్టణంలో హిందూ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకుగాను పట్టణంలోని ఆర్ఎస్ఎస్-విహెచ్పి- హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పడ్డ హిందూ ఉత్సవ సమితి సభ్యుల సేవలు అభినందనీయమని ట్రస్మా నిర్మల్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం రాత్రి బైంసా పట్టణంలోని వేదం తపోవనం పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన హిందూ ఉత్సవ సమితి సభ్యుల ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బైంసా పట్టణంలో గణేష్ చతుర్థి, దుర్గా నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా జరగడానికి హిందూ ఉత్సవ సమితి సభ్యులు రాత్రింబవళ్లు కష్టపడి ప్రశాంతంగా ముగిసేలా తోడ్పాటు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. హిందూ ఉత్సవ సమితి సభ్యులకు వేదం పరివార్ తరపున శాలువాతో సన్మానించి మెమొంటోను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ సాదుల కృష్ణ దాస్, హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు పెండేఫ్ కాశీనాథ్, సీనియర్ నాయకులు మాందాని, విహెచ్పి అధ్యక్షుడు డాక్టర్ మైపాల్, చింతపండు మహేష్ తో పాటు బైంసా పట్టణ ప్రముఖులు, ఉత్సవ సమితి సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment