మాదకద్రవ్యాల ముప్పు పై విద్యార్థులకు అవగాహన
కల్లురులో వాడేకర్ లక్ష్మణ్ ప్రత్యేక కార్యక్రమాలు
కుంటాల మండలం లోని కల్లూర్ లోని వాసవి హై స్కూల్ మరియు ప్రభుత్వ జెడ్‌పీహెచ్‌ఎస్ పాఠశాల, కళ్లూరు లో ఈరోజు టి.జి.ఎ.ఎన్. సొల్జర్ & స్పెషల్ ట్రైనర్ వాడేకర్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి.
వాసవి హై స్కూల్ లో జరిగిన కార్యక్రమంలో 350 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. ప్రభుత్వ జెడ్‌పీహెచ్‌ఎస్ పాఠశాలలో కూడా 100 మందికి పైగా విద్యార్థులు చురుకుగా పాల్గొని అవగాహన పొందారు.
ఈ సందర్భంగా వాడేకర్ లక్ష్మణ్ మాట్లాడుతూ –
“మాదకద్రవ్యాలు మన శరీరాన్ని నాశనం చేస్తాయి, మెదడును బలహీనపరుస్తాయి, చదువుపై దృష్టి తగ్గించి భవిష్యత్తును చీకటిలోకి నెడతాయి. ఒకసారి వీటిని వాడే అలవాటు పడ్డాక, వాటి నుండి బయటపడటం చాలా కష్టం. మాదకద్రవ్యాలు కుటుంబాన్ని కూల్చివేస్తాయి, సమాజాన్ని నాశనం చేస్తాయి. విద్యార్థులు మంచి స్నేహితులను ఎంచుకోవాలి, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. జీవితాన్ని వెలుగులోకి తీసుకువచ్చేది జ్ఞానం, శ్రమ, క్రమశిక్షణ మాత్రమే” అని అన్నారు.
కార్యక్రమం చివరలో విద్యార్థులందరితో
“మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి – చదువులో, జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలి” అని ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజేశ్వర్, ఉపాధ్యాయులు సంతోష్, సుధర్శన్, రమేష్ సహా అన్ని అధ్యాపకులు, విద్యార్థులు విశేషంగా సహకరించారు.
ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఫౌండర్ గంప నాగేశ్వర్ రావు విద్యార్థుల భవిష్యత్తు కోసం ఉచితంగా ఈ తరహా అవగాహన కార్యక్రమాలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారని వాడేకర్ లక్ష్మణ్ ప్రత్యేకంగా గుర్తుచేశారు.