పదో తరగతి విద్యార్థులకు పరీక్షలపై అవగాహన సదస్సు

పదో తరగతి పరీక్షల అవగాహన సమావేశం

పాల్గొన్న విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ యోగితారాణ

ఎమ్4 న్యూస్ (ప్రతినిధి)

ముధోల్, ఫిబ్రవరి 11

పదో తరగతి విద్యార్థులకు పరీక్షలపై అవగాహన కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా ముధోల్ రబింద్రా ఉన్నత పాఠశాల మరియు బాసర మండల కేంద్రంలోని ఉర్దూ బాలికల పాఠశాల విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని తిలకించారు.

ఈ సందర్భంగా విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ యోగితారాణ విద్యార్థులకు ప్రేరణాత్మక సందేశం అందించారు. పరీక్షల సమయంలో విద్యార్థులు ఆందోళన చెందకుండా ధైర్యంగా ఎదుర్కొనాలని సూచించారు. సిలబస్ పూర్తయినప్పటికీ రివిజన్, ప్రత్యేక తరగతులు, స్లిప్ టెస్టులు నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం పెరిగిందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో బాసర మండల విద్యాధికారి జి. మైసాజి, రబింద్రా ఉన్నత పాఠశాల ప్రిన్సిపాల్ ఆసంవార్ సాయినాథ్, కరస్పాండెంట్ రాజేందర్, చైర్మన్ భీమారావు దేశాయ్, డైరెక్టర్ పోతన్న యాదవ్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment