చేయూత ఫౌండేషన్ ఆధ్వర్యంలో సిపిఆర్ పై అవగాహన
భైంసా మనోరంజని ప్రతినిధి సెప్టెంబర్ 13
భైంసా పట్టణంలోని వశిష్ట జూనియర్ కళాశాలలో విద్యార్థులకు-అధ్యాపక బృందానికి చేయూత ఫౌండేషన్ ఆధ్వర్యంలో 108 మెడికల్ టెక్నిషియన్ పూజారి లక్ష్మణ్ సిపిఆర్ పై అవగాహన కల్పించడం జరిగింది. ఆహారపు అలవాట్ల వల్ల ఎన్నో వ్యాధులకు గురి అవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా గుండెపోటు సంభవించేటువంటి పరిస్థితులు చాల ఉన్నాయి. మానవునికి గుండె పోటు వచ్చి అపస్మారక స్థితిలోకి వెళ్ళినప్పుడు గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. ఈ సందర్భంలో సీపీఆర్ ద్వారా గుండె మళ్లి కొట్టుకోవడం ప్రారంభమై కోలుకునే అవకాశం ఉంటుంది. సిపిఆర్ ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం చేయూత ఫౌండేషన్ అధ్యక్షులు కొత్తుర్ శంకర్, 108 మెడికల్ టెక్నీషియన్ పూజారి లక్ష్మణ్, సత్యనారాయణ, గురుకర్ అనిల్, కళాశాల యాజమాన్యం పాల్గొన్నారు. విద్యార్థులకు సీపీఆర్ పై అవగాహన కల్పించినందుకు కలశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్ ధన్యవాదాలు తెలిపారు