కాంగ్రెస్ బాకీ కార్డు ద్వారా ప్రజలకు అవగాహన – కుంటాల మండలంలో బి.ఆర్.యస్ కార్యక్రమం
M4News ప్రతినిధి – కుంటాల, అక్టోబర్ 9
కుంటాల మండల కేంద్రంలో బుధవారం ముధోల్ నియోజకవర్గ బి.ఆర్.యస్ పార్టీ సమన్వయకర్త, మాజీ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా జడ్పీ చైర్మన్ లోలం శ్యాంసుందర్ ఆధ్వర్యంలో బి.ఆర్.యస్ పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా శ్యాంసుందర్ మాట్లాడుతూ, “కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసి గద్దెనెక్కి 22 నెలలు గడిచినా, ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. ప్రజలతో చేసిన వాగ్దానాలు నెరవేర్చని కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు ప్రజల కళ్లలో పొడి వేయాలని చూస్తోంది” అని అన్నారు.
ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం బాకీగా ఉన్న పథకాల వివరాలను “కాంగ్రెస్ బాకీ కార్డు” రూపంలో తెలియజేస్తూ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ మోసపూరిత హామీలకు మోసపోకుండా, అభివృద్ధి, నిబద్ధతతో పని చేసే బి.ఆర్.యస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని శ్యాంసుందర్ పిలుపునిచ్చారు.
అలాగే, మండలంలోని బి.ఆర్.యస్ కార్యకర్తలు గ్రామాల వారీగా ప్రజలలోకి వెళ్లి కాంగ్రెస్ ఆరు గ్యారంటీలలో నెరవేరని అంశాలను “బాకీ కార్డు” ద్వారా వివరించాలని దిశా నిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ పడకంటి దత్తు, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ పెంటవార్ దశరథ లింబా (బి), మాజీ సర్పంచ్ గంగాధర్, మండల వైస్ కన్వీనర్ వీరేకర్ దత్తు, శ్రీనివాసరావు, వంశీ ముదిరాజ్, ఏముల నరేష్, సాయన్న, బాబు తదితరులు పాల్గొన్నారు.