సిపిఆర్ పై విద్యార్థులకు అవగాహన
బైంసా మనోరంజన్ ప్రతినిధి అక్టోబర్ 17
బైంసా పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు సిపిఆర్ పై 108 ఈఎంటి లక్ష్మణ్ పూజారి అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో గుండెపోటు సంభవించి అపస్మారక స్థితిలో వెళ్లినప్పుడు సిపిఆర్ చేసి వారి ప్రాణాలు కాపాడవచ్చు అన్నారు. ప్రతి ఒక్కరూ సిపిఆర్ పైన అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, 108 పైలెట్ గౌతం, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.