బాలశక్తి కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన

మనోరంజని ప్రతినిధి నిర్మల్ జులై 28 – జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన బాలశక్తి కార్యక్రమం కింద సోమవారం నిర్మల్ పట్టణంలోని ఈద్గామ్ చౌరస్తాలోని ప్రభుత్వ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఆర్థిక సాక్షరతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ శ్రీ రామ్ గోపాల్ మాట్లాడుతూ, రాష్ట్రంలోనే మొదటిసారిగా నిర్మల్ జిల్లాలో బాలశక్తి కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టడం గర్వకారణమన్నారు. ప్రతి విద్యార్థికి బ్యాంకింగ్ పద్దతులు, ఆర్థిక నైపుణ్యాలపై అవగాహన అవసరం అని తెలిపారు. నేటి డిజిటల్ యుగంలో సైబర్ మోసాల ప్రబల నేపథ్యంలో ఆర్థిక జాగ్రత్తలపై విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు బార్టర్ వ్యవస్థ నుండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటుకు దారితీసిన పరిణామాలపై, ఆర్‌బీఐ పాత్ర, బ్యాంకుల జాతీయీకరణ అవసరం వంటి అంశాలపై సమగ్ర సమాచారం అందించారు. అలాగే, సేవింగ్స్ అకౌంట్లు (SB), రికరింగ్ డిపాజిట్ (RD), టర్మ్ డిపాజిట్ (TDR), కరెంట్ అకౌంట్లు (CA) వంటి ఖాతాల రకాలపై వివరించారు. బ్యాంకు కస్టమర్, నాన్ కస్టమర్ మధ్య తేడాలు, బ్యాంకింగ్ సేవలపై స్పష్టతనిచ్చారు. చెక్కుల జాగ్రత్తలు, రుణాల వర్గీకరణ, మూడవ పార్టీకి చెక్కులిచ్చే విషయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బేరర్‌, ఆర్డర్‌, స్టేల్‌, అవుట్‌డేటెడ్‌ చెక్కుల విషయాలను వివరించారు. భద్రతతో కూడిన రుణాలు (హోం, గోల్డ్‌, బిజినెస్‌, ఎడ్యుకేషన్‌), భద్రత లేని వ్యక్తిగత రుణాల మధ్య తేడాలపై అవగాహన కల్పించారు. అలాగే, ఆర్థిక విధానాలు, డిజిటల్ లావాదేవీలు, రిజర్వ్ బ్యాంక్‌ విధానాలు (మానిటరీ పాలసీ, క్రెడిట్ పాలసీ, సిఆర్‌ఆర్‌, ఎస్‌ఎల్‌ఆర్‌, రెపో రేట్‌, రివర్స్ రెపో రేట్‌) క్యాసా డిపాజిట్లు, వడ్డీ రేట్లు తదితర అంశాలపై విద్యార్థులకు వివరించారు. సైబర్ భద్రత నేపథ్యంలో ఓటీపీ, నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్, సీవీవీ నంబర్లు ఇతరులతో పంచుకోవద్దని, సైబర్ మోసాల నుంచి ఎలా కాపాడుకోవాలో సూచనలు అందించారు. NEFT, RTGS, IMPS లావాదేవీలను వివరించారు. విద్యార్థులు ఆసక్తితో పాల్గొని ప్రశ్నలు అడిగి తగిన జ్ఞానం సంపాదించారు. ఈ కార్యక్రమంలో DTDO అంబాజీ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment