నేవీలో ఉద్యోగం సాధించిన పూర్వ విద్యార్ధికి సన్మానం
ఎమ్4 ప్రతినిధి ముధోల్
మండల కేంద్రమైన బాసరలోని నాగభూషణ విద్యాలయానికి సంబంధించిన పూర్వ విద్యార్థి రాథోడ్ సాయిప్రసాద్ ఇండియన్ నేవీ లో ఉద్యోగం సాధించడం జరిగింది. దింతో నాగభూషణ విద్యాలయం ప్రధానోపాధ్యాయులు జారికొటే బాబురావు మంగళవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా విద్యార్థికి వ్యాసపురి కన్యకా పరమేశ్వరి ట్రస్టు ఇన్చార్జి సంతోష్ గాదేవార్ అభినందించారు. విద్యార్థి మాట్లాడుతూ తనకు చిన్నతనంలో విద్యాబుద్దులు నేర్పిన ఉపాధ్యాయులను కలిసి కృతజ్ఞతలు తెలియజేశాడు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మాట్లాడుతూ ఇండియన్ నేవీ లో ఉద్యోగం సాధించడం పాఠశాలకు గర్వ కారణమని విద్యార్థి జీవితంలో ముందు ఎన్నో ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.