గ్రూప్–1 పరీక్షలో విజేతకు సన్మానం

గ్రూప్–1 పరీక్షలో విజేతకు సన్మానం

గ్రూప్–1 పరీక్షలో విజేతకు సన్మానం

కృషి, పట్టుదలతో సాధించిన విజయం అందరికీ స్ఫూర్తిదాయకం — ఎస్పీ డి. జానకి, ఐపీఎస్

మనోరంజని తెలుగు టైమ్స్ మహబూబ్‌నగర్ జిల్లా ప్రతినిధి – అక్టోబర్ 22

మహబూబ్‌నగర్ జిల్లా భరోసా సెంటర్ ఇన్‌చార్జ్‌గా విధులు నిర్వర్తిస్తున్న మహిళా సబ్ ఇన్స్పెక్టర్ సుజాత తెలంగాణ ప్రభుత్వ గ్రూప్–1 పరీక్షల్లో ప్రతిభ కనబరచి డీఎస్పీగా ఎంపిక కావడం గర్వకారణమని జిల్లా ఎస్పీ డి. జానకి, ఐపీఎస్ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా రిలీవ్ అవుతున్న సుజాతను జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ డి. జానకి తన చాంబర్‌లో సన్మానించి అభినందనలు తెలిపారు.

ఎస్పీ మాట్లాడుతూ, “సుజాత కృషి, పట్టుదల, సమయపాలన ఈ విజయానికి మూలాధారం. ఆమె సాధించిన ఈ విజయంతో పోలీస్ శాఖలోని సిబ్బంది అందరికీ స్ఫూర్తి లభించాలి. క్రమశిక్షణతో పాటు నిరంతర విద్యావ్యాసంగం కొనసాగిస్తే ఎవరైనా ఉన్నత స్థానాలను సాధించవచ్చు,” అని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎస్పీ సిసి రామ్ రెడ్డి, ఆర్‌ఐ కృష్ణయ్య, స్పెషల్ బ్రాంచ్ ఎస్‌ఐ శ్రీనివాసులు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment