అవతార్ మెహర్ బాబా జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ

Avatar_Meher_Baba_Jayanti_Nizamabad
  • నిజామాబాద్‌లో అవతార్ మెహర్ బాబా 131వ జన్మదిన వేడుకలు వైభవంగా
  • ఉదయం 4 గంటల నుంచే భజనలు, సంకీర్తనలతో ఆరాధన కార్యక్రమాలు
  • ధుని వెలిగింపు, సప్తవర్ణ పతాకావిష్కరణ ప్రత్యేక ఆకర్షణ
  • బాబా బోధనలు, భక్తులకు స్పూర్తిదాయక సందేశాలు
  • సాయంత్రం భజనలు, ఫిల్మ్ ప్రదర్శన, నాటిక

 

నిజామాబాద్ ఎల్లమ్మ గుట్టలో గల అవతార్ మెహర్ బాబా కేంద్రంలో 131వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం 4 గంటల నుండి భజనలు, ప్రత్యేక సంకీర్తనలు సాగాయి. ఈ సందర్భంగా కేంద్ర కార్యదర్శి జనార్ధన్ భక్తులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, “బాబా బోధనల ప్రకారం శత్రువునికూడా ప్రేమించాలి. ప్రతి హృదయంలో ప్రేమ బీజాలు నాటటానికి అవతార్‌గా ఆయన రాత్రం” అని చెప్పారు.

 

భక్తులు బాబా నామస్మరణ చేస్తూ ప్రత్యేక సంకీర్తన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సప్తవర్ణ పతాకాన్ని ఆవిష్కరించడం, ధునిని వెలిగించడం జరిగింది. ధునిలో చందనం వేయడం వల్ల చెడు వ్యసనాలు దూరమవుతాయి అని ప్రచారకర్త మెహర్ ధర్మేంద్ర తెలిపారు.

సాయంత్రం బాబా భజనలు, బాబా జీవితంపై ఫిల్మ్ ప్రదర్శన, నాటిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరుకావాలని కేంద్ర ప్రచారకర్త మెహర్ ధర్మేంద్ర పిలుపునిచ్చారు.

ఈ వేడుకల్లో కేంద్ర అధ్యక్షుడు కాశీనాథ్ పవార్, కార్యదర్శి జనార్ధన్, ప్రచారకర్త మెహర్ ధర్మేంద్ర, భక్తులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment