- ఆడే గజేందర్ గుత్పాల గ్రామ పర్యటన
- కిడ్నీ బాధితులకు సొంత ఖర్చులతో మెరుగైన వైద్యం అందించే భరోసా
- రిమ్స్ హాస్పిటల్‌లో బాధితుల చికిత్సకు ప్రత్యేక ఏర్పాట్లు
- ఆసుపత్రి అధికారులతో చర్చించి బాధితులకు తగిన సేవలు అందజేశారు
ఆడే గజేందర్ నేరడిగొండ మండలంలోని గుత్పాల గ్రామంలో పర్యటించి కిడ్నీ బాధితులకు సొంత ఖర్చుతో మెరుగైన వైద్యం అందించడానికి ప్రయత్నించారు. బాధితులను అదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్‌కి తరలించి, ఆసుపత్రి అధికారులతో చర్చించి అవసరమైన చికిత్సలు అందించారు. బోథ్ నియోజకవర్గ ప్రజలకు సేవలందించడమే తన లక్ష్యమని ఆయన తెలిపారు.
ఆదిలాబాద్జి జిల్ల్లా నేరడిగొండ మండలంలోని గుత్పాల గ్రామంలో జనవరి 16న ఆడే గజేందర్ పర్యటించారు. ఈ సందర్బంగా, కిడ్నీ బాధితులకు తన సొంత ఖర్చులతో మెరుగైన వైద్యం అందించడానికి ముందుకొచ్చారు. బాధితులను ప్రైవేటు వాహనంలో అదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్‌కు తరలించారు.
రిమ్స్ డెరైక్టర్ జై సింగ్ రాథోడ్, DMHO నరేందర్ రాథోడ్‌లతో చర్చించి బాధితులకు తగిన చికిత్సలు అందించేందుకు అన్ని అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఆసుపత్రిలో వారికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు.
ఆడే గజేందర్ మాట్లాడుతూ, బోథ్ నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ సేవకుడిగా ఉంటానని, వారి సమస్యలను పరిష్కరించడానికి తన వంతు బాధ్యతను నెరవేరుస్తానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయన సైన్యం సభ్యులు పాల్గొన్నారు.