బోథ్ జడ్పిటిసి బరిలో స్వేచ్ఛగృహి అవార్డు గ్రహీత ఆత్రం సుశీల
మనోరంజని తెలుగు టైమ్స్ ఆదిలాబాద్ అక్టోబర్ 04
స్వయం సహాక సంఘంలో సభ్యులుగా సంఘం అధ్యక్షులుగా గ్రామ సంఘం అధ్యక్షులుగా మండల సమాఖ్య కార్యదర్శిగా. విశేషంగా సామాజిక సేవలు అందించిన ఆత్రం సుశీల వైపు అన్ని పార్టీల పార్టీల నాయకులు చూస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల జడ్పిటిసి అభ్యర్థి బరిలో స్వచ్ఛ గృహి అవార్డు గ్రహీత ఆత్రం సుశీల లాను బరిలో దించేందుకు పలు పార్టీల నాయకులతో సంప్రదింపులు జరుగుతున్నట్టు సమాచారం. స్థానిక ఎన్నికల్లో ఎలక్షన్ రిజర్వేషన్లు ప్రకటించిన నేపథ్యంలో రోజు రోజుకు రాజకీయ సమీకరణాలు మారుతున్న సందర్భంగా జడ్పిటిసి బరిలో బోత్ మండలము బాబేరా గ్రామానికి చెందిన ఆదివాసి గొండు తెగకు చెందిన ఆత్రం సుశీలను బోథ్ జడ్పిటిసి అభ్యర్థిగా పోటీలో నిలపాలని పలు పార్టీల నాయకులు ఆత్రం సుశీలను కోరినట్టు సమాచారం. తమ పార్టీ కండువను కప్పుకుంటే బోథ్ జడ్పిటిసిగా టికెట్ ఇవ్వడానికి తమకు ఎటువంటి అభ్యంతరం లేదని వాళ్ళ పార్టీల నాయకులు సుశీలను సంప్రదిస్తున్నట్టు సమాచారం. సుశీల ఒక మారుమూల గ్రామం, సామాన్య గృహిణి సామాన్య కుటుంబ సభ్యురాలిగా అంచలంచెలుగా ఎదుగుతూ 2008లో స్వయం సహాయక సంఘంలో సభ్యురాలిగా సంఘం అధ్యక్షురాలుగా గ్రామ సంఘం అధ్యక్షురాలుగా మండల మహిళా సమాఖ్య కార్యదర్శిగా. పదవి బాధ్యతలు చేపడుతూ బోథ్ మండల మహిళా సమాఖ్య తరఫునుంచి మహిళా సమాఖ్య రిప్రతినిధిగా పలు రాష్ట్రాలలో ఢిల్లీ స్థాయి వరకు వెళ్లి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వం మారుమూల గ్రామాలలో అభివృద్ధి చేస్తున్న సంక్షేమ పథకాల పైన శిక్షణ కోసం టూర్ విజిట్ కు వెళ్ళి పూర్తిస్థాయిలో అవగాహన కలిగి బోథ్ మండలంలోని పలు గ్రామాలలో స్వయం సహాయక సంఘాలు గ్రామ సంఘాల సభ్యులతో సమావేశాలు ఏర్పాటు చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పైన అవగాహన కల్పిస్తూ సామాజిక సేవకురాలుగా మహిళా సంఘాలకు సేవలు అందిస్తున్నారు. మారుమూల గ్రామాలలో గోండు గుడాలు పల్లెలలో గ్రామంలో కాలినడకగా వెళుతూ ఆరోగ్యము పోషణ అక్షరాస్యత మరుగుదొడ్ల నిర్మాణం సీజన్ లో వచ్చే వ్యాధుల పైన గిరిజన ప్రాంతాలలో తిరుగుతూ పలు గిరిజన సంఘాలను మహిళలను చైతన్యం చేస్తూ మహిళా సభ్యులలో మంచి గుర్తింపు ఉండడంతో ఆమె చేస్తున్న సేవలకు గుర్తింపుగా 2020 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ఆమె సేవలను గుర్తించి ఆనాటి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందర్యం రాజన్ చేతులమీదుగా మీదుగా స్వచ్ఛ గృహి అవార్డ్ స్వీకరించడం జరిగిన విషయం అందరికీ విధితమే. ఆనాటి నుంచి నేటి వరకు సుమారు 20 వరకు ఆమెకు అవార్డులు లభించడం ఒక రికార్డుగా అందరు భావిస్తున్నారు. జడ్పిటిసి స్థానానికి గిరిజనుల నుంచి మహిళల కోటలో ఆత్రం సుశీలను జడ్పిటిసి అభ్యర్థిగా బరిలో ఉంటే ఒక ఆదివాసీ మహిళల మా అభ్యర్థిగా ప్రకటించినందుకు తమకు అన్ని రకాలుగా కలిసి వస్తుందని పలు పార్టీల నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవైపు ప్రభుత్వం కూడా మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడంతో. బోథ్ మండలంలో మహిళా ఓటర్లు కూడా ఎక్కువ ఉండడం అందులో స్వయం సహాయక సంఘాల సభ్యుల మద్దతు కూడా ఒక మహిళగా ఆత్రం శిష్యులకు కలిసి వస్తుందని అనుకుంటున్నారు. గొండ తెగకు చెందిన సుశీలకు ఆదివాసి మహిళలు పురుషులు ఒక చెల్లెగా అమ్మగా భావించి ఓటు వేసే అవకాశం గిరిజనులలో ఎక్కువగా ఉండటం వల్ల అన్ని రకాలుగా అన్ని పార్టీల నాయకులు కలిసి వస్తుందని ఆలోచనలు ఉన్నారు. పార్టీల నాయకులు ఆత్రం సుశీలను ఇప్పటికే అన్ని పార్టీల నాయకులు సంప్రదించినట్లు సమాచారం ఈనెల 8వ తేదీ కోర్టు తీర్పు కోసం వేచి చూద్దామని భరోసాతో అందరూ ఉన్నారు అని తెలిసింది. ఏది ఏమైనా ఏదో ఒక పార్టీ సుశీలకు జడ్పిటిసిగా టికెట్ ఇవ్వడం ఖాయమని పలు గిరిజనులు అభిప్రాయపడుతున్నారు