నేడు అటల్ బిహారీ వాజ్‌పేయ్ వర్ధంతి..!!
అటల్ బిహారీ వాజ్‌పేయ్ భారతదేశ మాజీ ప్రధానమంత్రిగా, రాజకీయ నాయకుడిగా, కవిగా, రచయితగా, వక్తగా దేశ చరిత్రలో తనదైన ముద్ర వేసుకున్న అసాధారణ వ్యక్తి.
ఆయన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) స్థాపక సభ్యుల్లో ఒకరు. రాజనీతిజ్ఞుడిగానే కాకుండా రాజకీయాల్లోనూ అజాత శత్రువనే గుర్తింపు దక్కించుకున్న అతికొద్ది మందిలో ఆయనొకరు. దాదాపు ఆరేళ్లపాటు ప్రధానిగా భారత దేశాన్ని పరిపాలించారు. ఆగస్టు 16న వాజ్‌పేయ్ వర్ధంతి.