పురాతన శ్రీదత్తాత్రేయ ఆలయంలో అన్నదానం
మనోరంజని ప్రతినిధి భైంసా, సెప్టెంబర్ 23
దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం నిర్మల్ జిల్లా భైంసా మండలం దెగాం గ్రామ సమీపంలోని అతి పురాతన శ్రీదత్తాత్రేయ దేవస్థానంలో అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమం గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ మాన్య సుభాష్ పటేల్ ఆధ్వర్యంలో జరిగింది.
వివిధ గ్రామాల నుండి తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అందరికీ మహాప్రసాదం పంపిణీ చేశారు.
ఆలయ కమిటీ, దేవస్థానం ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ— నవరాత్రి ఉత్సవాల ముగింపు వరకు ప్రతిరోజూ అన్నదానం కొనసాగుతుందని తెలిపారు.