విద్యానిధికి తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం విరాళం

విద్యానిధికి తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం విరాళం

మహబూబ్నగర్ జిల్లా ప్రతినిధి: మనోరంజని, తెలుగు టైమ్స్

విద్యానిధికి తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం విరాళం

తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం 7 లక్షల 50 వేల రూపాయల చెక్కును మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ ను అందజేసింది. ఈ కార్యక్రమం ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో జరిగింది. ఈ విరాళం Telangana Government Departmentsలో పనిచేసే 27 శాఖల అధికారుల నుండి సేకరించబడింది. ఇదే కాకుండా, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ తన మొదటి నెల జీతం లక్ష రూపాయల చెక్కు రూపంలో ఈ విద్యా నిధికి విరాళం అందించారు. విరాళం అందజేసే వేడుకలో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామకృష్ణ గౌడ్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి ఈ విరాళాన్ని స్వీకరించి, పేద విద్యార్థుల అభివృద్ధికి ఈ నిధి మరింత సేవలు చేయాలని కృతజ్ఞతలు తెలియజేశారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ,
“ఈ సంవత్సరం జనవరిలో ప్రారంభించిన మహబూబ్నగర్ విద్యా నిధి తెలంగాణ రాష్ట్రంలో విపులంగా గుర్తింపు పొందుతోంది. ఇది పేద విద్యార్థుల విద్యాభ్యాసానికి కీలక మార్గం అవుతుంది. విద్యా నిధి ద్వారా సేకరించిన ప్రతి రూపాయి ప్రభుత్వ పాఠశాలలలో, హాస్టల్స్ లో చదువుతున్న విద్యార్థులకు అందజేయబడుతుంది.”
అని తెలిపారు. అయితే, విద్యార్థులకు ఆధునిక సౌకర్యాలు అందించే దిశగా డిజిటల్ లెర్నింగ్ సెంటర్లు కూడా ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. మొదటగా నియోజకవర్గంలో 25 డిజిటల్ లెర్నింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు “మహబూబ్నగర్ను తెలంగాణలో విద్యా కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో నిన్ను సకల చర్యలు చేపడుతున్నాం,” అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యారంగానికి మరింత మద్దతు వస్తుందని, విద్యార్థులు స్ఫూర్తితో విద్యాబ్యాసం చేసేందుకు ఇది దోహదపడుతుందని అన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment