ఆశ్రమ పాఠశాల సిఆర్టి కుటుంబాన్ని ఆదుకోవాలి

ఆశ్రమ పాఠశాల సిఆర్టి కుటుంబాన్ని ఆదుకోవాలి

ఆశ్రమ పాఠశాల సిఆర్టి కుటుంబాన్ని ఆదుకోవాలి

గిరిజన సంఘం జిల్లా నాయకులు నరేందర్ రాథోడ్

ముధోల్ మనోరంజని ప్రతినిధి జూలై 29

ముధోల్ ఆశ్రమ పాఠశాలలో సిఆర్టి వ్యాయామ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న ఆడే నరేష్ అకస్మికంగా మృతి చెందడంతో కుటుంబాన్ని ఆదుకోవాలని గిరిజన సంఘం జిల్లా నాయకులు రాథోడ్ నరేందర్ కోరారు. ప్రమాదంలో మృతి చెందిన ఆడే నరేష్ తన విధులను క్రమశిక్షణతో నిర్వహించారని పేర్కొన్నారు. అదే బాధ్యతతో బయోమెట్రిక్ హాజరు కోసం త్వరగా చేరేందుకు ద్విచక్ర వాహనంపై ప్రయాణించి ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుపేద కుటుంబానికి చెందిన సిఆర్టికు ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని కోరారు. నిరుపేద కుటుంబం నుండి వచ్చి సిఆర్టిగా పనిచేస్తూ తన కొడుకును సమాజానికి వైద్య సేవలు అందించేందుకు డాక్టర్ చదువులు చదివిస్తున్నారని పేర్కొన్నారు. అయితే సిఆర్టి అకాల మరణంతో కుటుంబం ఆర్థికంగా చితికిపోయి పిల్లల చదువులు సైతం మధ్యలోనే ఆగిపోయే అవకాశం ఉందని తెలిపారు. మృతుని కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని అదేవిధంగా మెడిసిన్ చదువుతున్న కుమారుడికి ఆర్థిక భరోసా కల్పించాలని అన్నారు. ఐటీడీఏ పరిధిలో పనిచేస్తున్న సిఆర్టిలకు ప్రభుత్వం ఉద్యోగుల హోదా ఇవ్వాలని, కుటుంబ భద్రతా పథకాలు అమలు చేయాలని పేర్కొన్నారు. ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి మృతుని కుటుంబానికి అన్ని విధాల అండగా ఉండాలని కోరారు

Join WhatsApp

Join Now

Leave a Comment