ప్రకృతి సంరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి.
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్.
మనోరంజని, మంచిర్యాల జిల్లా ప్రతినిధి.
ప్రకృతి సంరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, వాటిని సంరక్షించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. భీమారం మండల కేంద్రంలో నిర్వహించిన వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2000 మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ కిషన్ , ఎంపీడీవో మధుసూదన్ ,ఎంపీఓ సతీష్ రెడ్డి,ఏపీఓ జీనత్ , అటవీ శాఖ అధికారులు ఏపీఎం, అంగన్వాడీ టీచర్లు ,ఈసీ, టి ఏ లు, ఫీల్డ్ అసిస్టెంట్ లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.