తేదీ: 18.10.2024
ప్రతినిధి: AP&TG
శబరిమల అయ్యప్ప ఆలయ ప్రధాన పూజారిగా అరుణ్ కుమార్ నంబూద్రి ఎంపికయ్యారు. కేరళలోని ప్రఖ్యాత అయ్యప్ప స్వామి ఆలయంలో లాటరీ పద్ధతిలో 40మంది పూజారుల నుంచి ప్రధాన పూజారిని ఎంపిక చేస్తారు.
అదేవిధంగా, మాలికాపురం ఆలయ ప్రధాన పూజారిగా కొజికోడ్కు చెందిన వాసుదేవన్ నంబూద్రి నియమితులయ్యారు.
శబరిమల ఆలయంలో ఈ నియామకాలు ప్రత్యేక సందర్భంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనవి. పూజారుల ఎంపిక లాటరీ విధానం ద్వారా జరుగుతుండటంతో ఇది మరింత ప్రత్యేకతను సంతరించుకుంది.