నిజామాబాద్‌లో కళల పండుగ – కలం స్నేహం ఆధ్వర్యంలో కవి సమ్మేళనం

నిజామాబాద్‌లో కళల పండుగ – కలం స్నేహం ఆధ్వర్యంలో కవి సమ్మేళనం
జాతీయ స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కవుల, కళాకారుల గౌరవ వేదిక

మనోరంజని ప్రతినిధి నిజామాబాద్ ఆగస్టు 03 –

నిజామాబాద్‌లో కళల పండుగ – కలం స్నేహం ఆధ్వర్యంలో కవి సమ్మేళనం


జాతీయ స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఎల్లమ్మ గుట్ట మున్నూరుకాపు సంఘం భవనంలో కలం స్నేహం ఆధ్వర్యంలో నిర్వహించిన కవి సమ్మేళనం కళా అభిమానులకు నిజమైన సాహిత్య ఆనందాన్ని అందించింది. ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లాకు చెందిన పలువురు ప్రముఖ కవులు, కళాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మల్ జిల్లాకు చెందిన కళాకారులను కలం స్నేహం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు గోపాల్ ఆచార్య, నిర్వాహకులు హరిరమణ, సుధ తదితరులు జ్ఞాపికలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. పలకరించిన కళా ప్రతిభ ఈ కార్యక్రమంలో కలం స్నేహం నిర్మల్ జిల్లా అధ్యక్షులు దేవి ప్రియ, కార్యదర్శి కడారి దశరథ్, ఉపాధ్యక్షులు శ్యామల, కవులు రావుల గంగన్న, నాగరాజు, అంజయ్య, భూమన్న, సుజాత, తోట గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.ప్రతిభ నాట్య విభాగానికి చెందిన చిన్నారులు ప్రణవ శ్రీ, సరక్షి తమ నృత్య ప్రదర్శనలతో సందడి చేశారు. ఈ కార్యక్రమం సాహిత్యం, స్నేహం, సంస్కృతి మేళవింపుగా ముగిసింది. ప్రాంతీయ కవులు ఒకే వేదికపై కలుసుకొని భావాల్ని పంచుకోవడం విశేషంగా నిలిచింది

Join WhatsApp

Join Now

Leave a Comment