*కొత్త రేషన్ కార్డులు కోసం అప్లికేషన్ పెట్టుకోవడానికి ప్రకటనలకే పరిమితమయ్యాయి*
నిజామాబాద్ జిల్లా, , ఫిబ్రవరి11 మనోరంజని ప్రతినిధి,
ఆర్మూర్ పట్టణంలోని అర్హులైన వారికి రేషన్ కార్డులు అప్లికేషన్ పెట్టుకోవడానికి మాత్రమే పరిమితమయ్యాయని అర్హులు తమ ఆవేదన వ్యక్తం చేశారు గత ప్రభుత్వం బిఆర్ఎస్ పాలనలో కొత్త రేషన్ కార్డులు మంజూరు కాలేదు, కనీసం కాంగ్రెస్ ప్రభుత్వమైన కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తుందని,గత సంవత్సరం నుండి ఎదురుచూస్తున్న అర్హులు,గత టిఆర్ఎస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేకపోయింది, రేషన్ కార్డులో ఉన్న పేర్లను కూడా తొలగించింది, తొలగించిన పేర్లను మళ్ళీ చేర్చలేకపోయింది, అందుకే ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు, కనీసం కాంగ్రెస్ పాలనలోనైనా కొత్త రేషన్ కార్డులు ఇస్తారని,
ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న పేద ప్రజలు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఎన్నికల కోడ్ అంటూ వాయిదా వేస్తూ పేద ప్రజలను మోసం చేస్తున్నారని, ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేశారు, ఇప్పటివరకు మంత్రులు నాయకులు దానిపై మాట్లాడడం తప్ప, ప్రకటనలకే పరిమితమై ముందుకు సాగడం లేదు,గత బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మోసం అలాగే ఈ ప్రభుత్వం కూడా అలాగే చేస్తుందని తమ ఆవేదనను వ్యక్తం చేశారు, పాత రేషన్ కార్డులో తొలగిపోయిన పేర్లను ఇప్పటివరకు చేర్చలేదు,ఇకనైనా ఎన్నికల కంటే ముందు కొత్త రేషన్ కార్డులు ఇస్తేనే తమకు ప్రభుత్వం పై నమ్మకం కలుగుతుందని, ప్రభుత్వానికి ప్రజలు తమ గోడును విన్నవించుకున్నారు.