ఆరాధన ఆయుర్వేద ఆధ్వర్యంలో వైద్య శిబిరం
మనోరంజని తెలుగు టైమ్స్ ముధోల్ ప్రతినిధి అక్టోబర్ 16
నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రమైన ముధోల్లోని శ్రీపశుపతినాథ్ శివాలయ మండపంలో ఆరాధన ఆయుర్వేద వెల్నెస్ రీసెర్ సెంటర్(బైంసా) ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వైద్యురాలు జూలీ(కేరళ) మాట్లాడుతూ దీర్ఘకాలిక వ్యాధులకు ఆయుర్వేద మందులు- యోగ -నేచురోపతి పద్ధతుల్లో ఉపశమనం పొందవచ్చు అన్నారు. వైద్య శిబిరంలో దాదాపు 100 మంది రోగులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించడంతోపాటు మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు వేదాంత్ పాటిల్, బిడిసి అధ్యక్షుడు వరగంటి విఠల్, మున్నూరు కాపు సంఘం తాలూకా అధ్యక్షుడు రోళ్ళ రమేష్, బీడీసీ ఉపాధ్యక్షుడు పల్లె నాగేష్, కోశాధికారి జిందంవార్ వెంకటేష్, ఆసుపత్రి పర్యవేక్షకులు పి. శ్రీనివాస్, సిబ్బంది గణేష్, పాపేష్, తదితరులు పాల్గొన్నారు.