హమారా సహారా యూత్ సేవలకు ప్రశంసలు

హమారా సహారా యూత్ సేవా కార్యక్రమాలు
  1. హమారా సహారా యూత్ స్థాపన: 2020లో ఆయుబ్ అహ్మద్ భైంసాలో ఈ సేవా సంస్థను ప్రారంభించారు.
  2. రక్తదానం సేవలు: తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితుల్లో వేలాది రోగులకు రక్తదానం అందించారు.
  3. కోవిడ్ సేవలు: కోవిడ్ కాలంలో మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు.
  4. సాంప్రదాయ సేవలు: హిందు సాంప్రదాయం ప్రకారం కూడా సేవలు చేసి సమాజానికి ఆదర్శంగా నిలిచారు.
  5. వివాహ సహాయం: పేద కుటుంబానికి చెందిన యువతి వివాహానికి చేయూత అందించారు.

హమారా సహారా యూత్ సేవా కార్యక్రమాలు


హమారా సహారా యూత్ సేవా కార్యక్రమాలు

నిర్మల్ జిల్లా భైంసాకు చెందిన హమారా సహారా యూత్, ఫౌండర్ ఆయుబ్ అహ్మద్ నేతృత్వంలో రక్తదానం, కోవిడ్ సేవలు వంటి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ, మహారాష్ట్రలో వేలాది రోగులకు రక్తం అందించారు. అంతేకాకుండా హిందూ సాంప్రదాయం ప్రకారం పేదల అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు. వీరి సేవలకు ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి.

హమారా సహారా యూత్ సేవా కార్యక్రమాలు


హమారా సహారా యూత్ సేవా కార్యక్రమాలు

2020లో భైంసా పట్టణానికి చెందిన హమారా సహారా యూత్ సేవా సంస్థను ఫౌండర్ ఆయుబ్ అహ్మద్ స్థాపించారు. రక్తం లభించక తన సన్నిహితుడి మరణం ఆయనకు కలవరపాటుకు గురి చేసింది. ఆ ఘటనతో ఆసుపత్రుల్లో అత్యవసర పరిస్థితుల్లో రోగులకు రక్తదానం అందించేందుకు ఈ సంస్థను ప్రారంభించారు.

హమారా సహారా యూత్ సేవా కార్యక్రమాలు

హమారా సహారా యూత్ ఆధ్వర్యంలో ఇప్పటివరకు తెలంగాణలోని నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలు మరియు మహారాష్ట్రలోని నాందేడ్ వంటి ప్రాంతాల్లో 3-4 వేల మంది రోగులకు అత్యవసర సమయంలో రక్తం అందించారు.

హమారా సహారా యూత్ సేవా కార్యక్రమాలుహమారా సహారా యూత్ సేవా కార్యక్రమాలు

కోవిడ్ విజృంభణ సమయంలో ముధోల్, బాసర, కుబీర్ మండలాల్లో మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు. హిందు సాంప్రదాయం ప్రకారం స్వయంగా ఖర్చులు వెచ్చించి పేదల అంతక్రియలు నిర్వహించారు.

హమారా సహారా యూత్ సేవా కార్యక్రమాలు

అంతేకాకుండా, భైంసాలో హిందూ పండగల సమయంలో భక్తులకు తాగునీరు, మజ్జిగ పంపిణీ చేశారు. నిరుపేద కుటుంబానికి చెందిన యువతి వివాహానికి సహాయం అందించి వారి జీవన ప్రయాణంలో తోడుగా నిలిచారు.

సేవలు గుర్తించిన నెటిజన్లు, ప్రముఖులు వీరికి అభినందనలు తెలిపారు. క్రీడా పోటీల్లో భాగస్వామ్యం కల్పించడం, పోలీసు సహకారంతో తప్పిపోయిన వారికి సహాయం అందించడం కూడా ఈ సంస్థ ప్రత్యేకత. రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని ఆయుబ్ అహ్మద్ వెల్లడించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment