డిగ్రీ కళాశాలలో టీచింగ్- నాన్ టీచింగ్ స్టాఫ్ నియమించండి

డిగ్రీ కళాశాలలో టీచింగ్- నాన్ టీచింగ్ స్టాఫ్ నియమించండి

డిగ్రీ కళాశాలలో టీచింగ్- నాన్ టీచింగ్ స్టాఫ్ నియమించండి

మనోరంజని ప్రతినిధి ముధోల్ జులై 06

నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రమైన ముధోల్లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో టీచింగ్- నాన్ టీచింగ్ స్టాఫ్ ను నియమించాలని కోరుతూ ఉన్నత విద్యా కమిషనర్ ఆఫ్ కాలేజీయేట్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో సంయుక్త సంచాలకులు డాక్టర్. డి ఎస్ ఆర్ రాజేందర్ సింగ్ కి ముధోల్ మాజీ సర్పంచ్ వెంకటాపూర్ రాజేందర్ వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత విద్యా సంవత్సరంలో డిగ్రీ కళాశాలలో బీఎస్సీ (ఎంపీసీ), బీఏ గ్రూపులలో విద్యార్థులు అడ్మిషన్లు తీసుకున్నారని పేర్కొన్నారు. విద్యార్థులకు పాఠాలు చెప్పడానికి గణితం- భౌతిక శాస్త్రం-హిస్టరీ- పొలిటికల్ సైన్స్ పోస్టులకు పర్మిషన్లు ఇచ్చి నియామకాలు జరపాలన్నారు. అదేవిధంగా నాన్ టీచింగ్ స్టాఫ్ ను సైతం నియమించాలని కోరారు. కాలేజీలో నాన్ టీచింగ్ స్టాఫ్ లేకపోవడంతో విద్యార్థులు- స్టాఫ్ ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. కాలేజీలో సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, ఫర్నిచర్ కంప్యూటర్, కాలేజ్ అభివృద్ధికి 20 లక్షల నిధులు మంజూరు చేయాలని కోరారు. అడ్మిషన్ షెడ్యూల్ ప్రకారం క్లాసెస్ మొదలయ్యాయని కాబట్టి కాలేజీలో రెగ్యులర్ స్టాప్ నియామకానికి పర్మిషన్ ఇవ్వాలన్నారు. గత సంవత్సరం పనిచేసిన గెస్ట్ లెక్చరర్ వల్ల అడ్మిషన్లు అయ్యాయని ప్రస్తుతం సైతం వారికి పర్మిషన్ లేకపోవడం వల్ల విద్యార్థులు ప్రైవేటు కళాశాలలో వెళ్లడం జరిగిందన్నారు. సాధ్యమైనంత త్వరలో డిగ్రీ కళాశాలకు టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ నియమిస్తూ తగినన్ని నిధులు కేటాయించాలని విన్నవించారు

Join WhatsApp

Join Now

Leave a Comment